కరోనా వేవ్ మొదలైనప్పటినుంచీ.. ఫ్లాస్మా థెరపీ మాట వినిపిస్తూనే ఉంది. కరోనాను జయించేందుకు చాలామంది ఫ్లాస్మా థెరపీని ఉపయోగించారు. కరోనాను జయించిన వారి నుంచి ప్లాస్మాను సేకరించి పరిస్థితి సీరియస్‌గా ఉన్న బాధితులకు ఎక్కించేవారు. తద్వారా అతడి శరీరంలో యాంటీబాడీలు తయారై కరోనాను అడ్డుకుంటాయని డాక్టర్లు చెప్పారు. కానీ పెద్దగా ఫలితాలు లేకపోవడంతో ప్లాస్లా థెరపీని పక్కనపెట్టింది కేంద్రం. కరోనా రోగులకు ఇక నుంచి ప్లాస్మా థెరపీ పద్దతిలో చికిత్స ఇవ్వకూడదని స్పష్టం చేసింది.కోవిడ్ చికిత్స నుంచి ప్లాస్మా థెరపీని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. కరోనా రోగుల్లో పరిస్థితి విషమించకుండా ప్లాస్మా థెరపీ నిరోధించలేకపోతోందని, మరణాలను నిలువరించలేకపోతుందని తేలిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
Must Read ;- భారత్‌కు త్వరలో mRNA కరోనా టీకాలు.. లుపిన్ ఫార్మా సన్నాహాలు











