అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం వైసీపీ ఎంపీ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు నాంపల్లి సీబీఐ కోర్టు చివరి అవకాశం ఇచ్చింది.ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసేందుకు చాలా సమయం ఇచ్చామని జూన్ 1వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయకుంటే నేరుగా విచారణ చేపడతామని సీబీఐ కోర్టు న్యాయమూర్తి సీరియస్‌గా చెప్పినట్టు తెలుస్తోంది.సీబీఐ నుంచి ఇంకా సమాచారం రాలేదని జగన్ తరపు న్యాయవాదులు వాదించగా,చివరి అవకాశం ఇస్తున్నట్టు న్యాయమూర్తి తెలిపారు.జగన్ తరపు న్యాయవాదులు కావాలనే జాప్యం చేస్తున్నారని రఘురామరాజు తరపు న్యాయవాదులు వాదించారు.దీనిపై స్పందించిన న్యాయస్థానం జూన్ 1లోగా కౌంటర్ దాఖలు చేయకుంటే నేరుగా విచారణ ప్రారంభిస్తామని ప్రకటించింది.
Must Read ;- సీబీఐ కొత్త డైరెక్టర్‌గా సుబోధ్ కుమార్ జైశ్వాల్











