పలువురు క్రేజీ సీనియర్ హీరోయిన్స్ .. సర్టెన్ ఏజ్ వచ్చాకా చక్కటి ఆరోగ్యం కోసం మిస మిసలాడే శరీర సౌష్ఠవం కోసం యోగాసనాల్ని ఆశ్రయించడం క్వైట్ కామన్. మలైకా అరోరా, శిల్ప శెట్టి లాంటి బాలీవుడ్ ముద్దుగుమ్మలు అందులో ఆరితేరిపోయారు. దానివల్లనే వారిద్దరూ ఫార్టీ ప్లస్ ఏజ్ లో కూడా తమ ముఖంలో ముదురుతనం కనిపించ నీయకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. అలాంటి వీరి లిస్ట్ లోకి చేర్చదగ్గ మరో ముద్దుగుమ్మ పూజా భాత్రా.

ఒకప్పుడు బాలీవుడ్ లో హాట్ నెస్ కు , బోల్డ్ నెస్ కు కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న పూజా భాత్రా.. ఈ ఏజ్ లో కూడా ఆ ట్యాగ్ ను అలాగే ఉంచుకోడానికి కష్టసాధ్యమైన యోగాసనాల్ని ప్రాక్టీస్ చేస్తూ.. మిగిలిన భామలకు చెమటలు పట్టిస్తోంది. పూజా ప్రస్తుతం తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన ఓ యోగా భంగిమ.. నెటిజెన్స్ కు షాకిస్తోంది. దీన్ని పదంగుస్తాసని అని అంటారట. త్రోబ్యాక్ పిక్ గా పోస్ట్ చేసిన ఈ యోగా బికినీ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాలిబొటనవేలిపై మాత్రమే ఆనుకొని .. కుడికాలును ఎడమకాలుపై వేసి గాల్లో నిలబడే ఈ ఆసనం వేయడం … అందులోనూ పూజా లాంటి నటీమణి వేయడం నిజంగా సాహసమనే చెప్పాలి. పూజా భర్త నవాబ్ షా.. ఆమె పోస్ట్ చేసిన త్రోబ్యాక్ పిక్ కు హార్ట్ అండ్ ఫైర్ ఎమోజీల్ని షేర్ చేసి.. ఆ ఫోటో మీద తన అభిప్రాయాన్ని తెలియచేశాడు. అలాగే.. పలువురు నెటిజెన్స్ పూజా యోగాసనాల్ని ప్రశంసిస్తూ.. కామెంట్స్ పెట్టారు.
Must Read ;- గ్రీన్ బికినీ తో కవర్ పేజీకెక్కిన ‘లెజెండ్’ గాళ్











