అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టు ఇవాళ స్పందించింది.వివరణ ఇవ్వాలంటూ ఏపీ సీఎం జగన్, సీబీఐకి కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై వచ్చే నెల 7న విచారణ జరపనున్నట్టు సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. ముందుగా ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పినట్టుగానే ఇవాళ కోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులకు స్పందించిన తరువాత వాటిని పరిశీలించి కోర్టు తదుపరి చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది.
సీఎం బెయిల్ రద్దవుతుందా?
అక్రమాస్తుల కేసులో ఏడాదిన్నరగా కోర్టు వాయిదాలకు కూడా ఏపీ సీఎం హాజరు కావడం లేదని, ఇలాగా కొనసాగితే న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం ఉందని, జగన్ బెయిల్ ఎందుకు రద్దు చేయడం లేదని వైసీపీ ఎంపీ రఘురామరాజు నాంపల్లి సీబీఐ కోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై సమగ్ర వివరాలు తీసుకున్న కోర్టు, ఇవాళ ఏపీ సీఎం జగన్‌కు, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. దీనిపై వచ్చే నెల ఏడున విచారణ జరిపి తదుపరి తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దవడం ఖాయమని ఎంపీ రఘురామరాజు ఓ ఛానల్లో ఫోన్లో మాట్లాడుతూ ధీమా వ్యక్తం చేశారు.
Must Read ;- జగన్ బెయిల్ రద్దుపై విచారణ.. తీర్పు రిజర్వు










