జగన్ బెయిల్ రద్దు చేయాలని కేసు వేసినందుకు నా కోసం కడప బ్యాచ్‌ను రంగంలోకి దించాలని చూస్తున్నారని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామరాజు ఢిల్లీలో వెల్లడించారు. రాక్షసులను అంతరించే పనిలో ఉండగా, కొంత మంది పిల్ల రాక్షసులు తయారయ్యారని రఘురామరాజు అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రస్టేషన్లో పాత అలవాటు ప్రకారం కడప వారిని రంగంలోకి దింపాలనుకుంటున్నారని నాకు సమాచారం అందింది. ట్రైచేయండి అంటూ గట్టిగా అరుస్తూ ఛాలెంజ్ చేశారు. నా ఒంటి మీద ఈగ వాలితో నిన్ను జనం తొక్కుకుంటూ వెళ్లిపోతారని రఘురామరాజు ఆవేశంగా చెప్పారు. దీనిపై ప్రధానికి కూడా పిర్యాదు చేస్తానన్నారు. నాకు ఏమైనా అయితే ఏపీలో ప్రభుత్వం రద్దవుతుందన్నారు. బాబాయిని లేపేశారు. ఒక ఎంపీని కూడా లేపాలనుకుంటున్నారని రఘురామరాజు అన్నారు. దీనిపై కేంద్ర హోం శాఖ కార్యదర్శికి కూడా ఫిర్యాదు చేస్తానన్నారు.
విజయసాయిరెడ్డిపై ఫిర్యాదు..
వైఎస్ వివేకానందరెడ్డి హత్యను గుండె పోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చి గుండెపోటుతో చనిపోయారని చెప్పడమే ఇందుకు నిదర్శనం అన్నారు. వివేకానందరెడ్డిని ఎవరు చంపారో అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ అన్నారు. ఏదో రకంగా కేసుల్లో ఇరికించి తనను అరెస్టు చేయాలని చూస్తున్నారని ఎంపీ రఘురామరాజు వెల్లడించారు.
Must Read ;- జగన్ బెయిల్ రద్దు చేయండి.. హైకోర్టులో ఎంపీ రఘురామరాజు పిటిషన్