కరోనా సెకండ్ వేవ్ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. ఇప్పటి వరకు పొరుగు రాష్ట్రాల్లో బాగా విస్తరించిన కరోనా తెలుగు రాష్ట్రాల్లోనూ కలకలం రేపుతోంది. తాజాగా హైదరాబాద్‌లో 38 మంది విద్యార్థులకు కరోనా సోకింది. నాగోల్ బండ్లగూడ మైనార్టీ వెల్ఫేర్ హాస్టల్ ఉంటున్న వారు కరోనా బారిన పడ్డారు. వెంటనే అప్రమత్తమైన వైద్యాధికారులు టెస్టులను చేస్తున్నారు. హాస్టల్ లో ఇంకెంత మందికి కరోనా వచ్చిందేమోనని అనుమానంతో టెస్టుల సంఖ్య పెంచుతున్నారు.
కనీస జాగ్రత్తలేవీ?
గత కొంతకాలంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో విద్యార్థుల విద్యాలయాల బాట పడుతున్నారు. అయితే హాస్టళ్లు, స్కూళ్లు, కాలేజీలు, ట్యూషన్ షెంటర్లలో కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఉంది. ప్రతిరోజు బెంచీలు, విద్యాలయాల పరిసరాలను శానిటైజ్ చేయాల్సి ఉంది. విద్యార్థులకు కూడా టెస్టులు చెసిన తర్వాత విద్యా బోధన, హస్టళ్ల ప్రవేశం ఉంటుంది. కానీ ఇందుకు విరుద్ధంగా విద్యా సంస్థలు వ్యవహరిస్తుండటంతో విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. కరీనంగర్ జిల్లాలోని కొన్ని స్కూళ్లలో విద్యార్థులు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Must Read ;- కరోనా కలవరం మళ్లీ మొదలైంది!