తెలంగాణ ప్రభుత్వం మళ్లీ అదే తప్పు చేస్తోంది. కరోనా వచ్చినప్పుడు దానిని ఎలా మేనేజ్ చేయాలో తెలియక.. ఫెయిల్యూర్ కప్పిపుచ్చుకోలేక సర్కస్ ఫీట్లన్నీ చేసింది. అయినా జనాన్ని కాపాడలేకపోయారు. ఒక విధంగా కరోనాతో అల్లకల్లోలమైంది జన జీవితం. కేవలం బయటి నుంచి వస్తున్నవారిని ట్రేస్ చేయకుండా.. వారికి టెస్టులు చేయకుండా వదిలివేయటమే దీనికి ప్రధాన కారణం. ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చింది. అయినా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. తీసుకోలేదు. ఇప్పుడు తీసుకుంటామని కబుర్లు చెబుతున్నారు.
మహారాష్ట్రలో సెకండ్ వేవ్..
మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ ఏ రేంజ్‌లో ఉందో చూస్తూనే ఉన్నాం. అన్ని రాష్ట్రాలు అలర్ట్ అయి.. బోర్డర్స్‌లో చెక్ పోస్టుల దగ్గర వచ్చిన వారికి టెస్టులు చేస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. చేస్తున్నామని ప్రకటనలు చేస్తున్నారే తప్ప.. వాస్తవానికి సరిగా ఏదీ జరగటం లేదు. ఒక అధికారి చెప్పినదాని ప్రకారం మహారాష్ట్ర నుంచి ఇప్పటికి రాష్ట్రంలోకి 50 వేల మందికి పైగా వచ్చారు. వీరంతా అక్కడ లాక్ డౌన్ విధించాక.. రాష్ట్రంలోకి తిరిగొచ్చినవాళ్లు. ఈ 50వేల మందికి టెస్టులు చేయలేదు. ఎవరికి కరోనా ఉందో.. ఎవరికి లేదో తెలియదు. ఆ కారణంతోనే మన దగ్గర మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే స్కూల్స్ తెరిచాక.. ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో కరోనా కేసులు భారీగా వచ్చాయి. అవన్నీ మహారాష్ట్ర బోర్డర్ లోనివే కావడం గుర్తించాల్సిన విషయం. ఇంత జరుగుతున్నా.. చెక్ పోస్టుల దగ్గర సరైన వ్యవస్ధను ఏర్పాటు చేయలేదు.
కేవలం స్కూల్స్‌లో వస్తున్న కేసుల గురించే..
ఇప్పటి వరకు మీడియాలో కేవలం స్కూల్స్‌లో వస్తున్న కేసుల గురించే వస్తోంది. కాని చాలా చోట్ల హైదరాబాద్ సిటీలో చాలామందికి కరోనా వచ్చింది. అందరూ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. కొందరు హోం క్వారంటైన్ లో ఉంటున్నారు. కాని ఇవేవీ అధికారికంగా ఎక్కడా చెప్పటం లేదు. ఒక ప్రధాన పత్రిక ఆఫీసులో 35 మందికి కరోనా వచ్చింది. రకరకాల కోచింగుల కోసం జిల్లాల నుంచి వచ్చిన స్టూడెంట్స్‌కి ఇక్కడ కరోనా సోకుతోంది. కాని వారు ఇంటికి తిరిగి వెళ్లాకే ఆ విషయం తెలుస్తుంది. అప్పటికే వారి కుటుంబసభ్యులంతా టచ్‌లోకి వచ్చేస్తున్నారు. దీంతో ఆ కుటుంబంలో, ఆ ఊర్లో సైతం కరోనా వ్యాపించేస్తోంది.
Must Read ;- తెలంగాణలో మళ్లీ కరోనా పంజా..
మళ్లీ సీరియస్ ప్రాబ్లెమ్..?
ఇలాగే అయితే మరికొన్ని రోజుల్లోనే మళ్లీ సీరియస్ ప్రాబ్లెమ్ వచ్చే అవకాశం కనపడుతోంది. కరోనా పీక్స్‌లో ఉన్నప్పుడే లాక్ డౌన్ వేయడానికి ఆలోచించిన కేసీఆర్.. తర్వాత ఎత్తేయడానికి ఆలోచించని కేసీఆర్.. ఇప్పుడు కూడా రాంగ్ స్టెప్స్ వేస్తున్నారు. లాక్ డౌన్ విధించకపోతే మరింత వ్యాపించడం ఖాయం. అదే జరిగితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మార్కెట్ మళ్లీ కుప్పకూలుతుందనేది ప్రభుత్వ భయం. కాని మనుషుల ప్రాణాల కన్నా ఏదీ ముఖ్యం కాదు కదా.. అందుకే లాక్ డౌన్ విధించాలనే డిమాండ్ వస్తోంది. మరేం చేస్తారో వేచి చూడాలి.
Also Read ;- హస్టళ్లలో కరోనా కలకలం