కేంద్రం సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించింది.మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది.కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు పరీక్షల నిర్వహణపై వివిధ వర్గాలతో చర్చలు జరిపారు.విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులను పరీక్ష రాసేందుకు బలవంతం చేయకూడదని ప్రధాని సూచించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.మరోవైపు ఈ పరీక్షలు రద్దు చేయాలంటూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టులో కేసు వేశారు.











