యంగ్ హీరో నాగశౌర్య ఈ ఏడాది పలు ఆసక్తికరమైన సినిమాల్ని లైన్ లో పెట్టుకున్నాడు. ప్రస్తుతం ‘వరుడు కావలెను, లక్ష్య, పోలీస్ వారి హెచ్చరిక’ అనే సినిమాలు ట్రాక్ మీదున్నాయి. వీటి చిత్రీకరణలో పాల్గొంటూనే తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై మరో సినిమాని కూడా వాటికి పేర్లల్ గా చేస్తున్నాడు. అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫ్యామిలీ కథతో తెరకెక్కుతోంది. ఈ క్రమంలో లేటెస్ట్ గా ఈ సినిమాకి సంబంధించిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది.
ఒకప్పటి టాలెంటెడ్ హీరోయిన్, ఇప్పటి కేరక్టర్ నటీమణి రాధికా శరత్ కుమార్ .. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న సినిమా కి సంబంధించిన పిక్ ను పోస్ట్ చేసింది. అందులో రాధికతో పాటు నాగశౌర్య కూడా రివీలయ్యాడు. ఒక దేవాలయ ప్రాంగణంలో తమిళ సాంప్రదాయ చీరకట్టులో రాధిక, పంచెకట్టులో నాగశౌర్య కనిపిస్తున్నారు. ఇక ట్విట్టర్ లో రాధిక .. నాగశౌర్యతో వర్క్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. అతడు ప్రతిభ ఉన్న నటుడు. అతడితో నటిస్తుంటే చాలా సందడిగా ఉంది. ఐరా క్రియేషన్స్ సినిమాకి సంబంధించిన హైద్రాబాద్ షెడ్యూల్ పూర్తి అని తెలిపింది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా ఇప్పటివరకూ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంది.
Must Read ;- భారీ రేటుకు వరుడు కావలెను డిజిటల్ రైట్స్
Such a pleasure working with @IamNagashaurya so talented and great fun . @ira_creations schedule wrap in Hyderabad #workmode 👍😂 pic.twitter.com/T3jYjjf5Wn
— Radikaa Sarathkumar (@realradikaa) March 7, 2021











