ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకీ పెరుగుతున్న కేసులు. ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో దీనికి వేక్సినేషనే సరైన మార్గమని చాలా మంది ఆ దిశగా వెళుతున్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీస్ వరుసగా వేక్సినేషన్ వేయించుకొని.. జనాన్ని మోటివేట్ చేస్తున్నారు. ఇటీవల లేడీ సూపర్ స్టార్ నయనతార, ఆమె బోయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ వేక్సిన్ వేయించుకోగా.. అంతకు ముందు గౌతమ్ కార్తిక్, రాధికా ఆప్టే కూడా వేక్సినేషన్ ఫస్ట్ డోస్ వేయించుకున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మహానటి కీర్తి సురేశ్ కూడా వచ్చి చేరింది.
కేరళలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కీర్తి సురేశ్ కోవిడ్ వేక్సినేషన్ వేయించుకున్నారు. బ్లూ కలర్ చెక్స్ కలిగిన డ్రెస్ తో, తెల్లటి మాస్క్ పెట్టుకొని కీర్తి వేక్సిన్ వేయించుకుంటున్న ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఈ ఫోటోస్ పోస్ట్ చేసి.. తను వేక్సినేషన్ వేయించుకున్న సంగతిని తెలిపింది. దీంతో ఆమెకు ఓ రేంజ్ లో కామెంట్స్ వచ్చి పడ్డాయి.
ప్రస్తుతం మోహన్ లాల్, రజినీకాంత్ లాంటి సినియర్ హీరోలతో పాటు మహేశ్ బాబు లాంటి యంగ్ హీరోల సరసన కీర్తిసురేశ్ నటిస్తూ .. తన కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా లీడ్ చేస్తోంది. ఎర్లియర్ గా రంగ్ దే తో ప్రేక్షకుల్ని పలకరించిన కీర్తి సురేశ్ .. ఈ సినిమా రిజల్ట్ తో కాస్తంత నిరాశకు గురైంది. అయినప్పటికీ.. రాబోయే సినిమాల మీద అమ్మడు ఎక్కువగా ఫోకస్ చేస్తోంది.
Must Read ;- హైద్రాబాద్ లో ‘సర్కారువారి పాట’ మూవీ రెండో షెడ్యూల్











