సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి సెన్సార్ బోర్డ్ ఊహించని షాక్ ఇచ్చింది. ఆయన అప్ కమింగ్ మూవీ వ్యూహంకి సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది.. ఈ సినిమాని వీక్షించిన సెన్సార్ బోర్డ్ సభ్యులు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేమని తేల్చి చెప్పారు… దీంతో, సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుంది.?? భారీ కట్స్ పడనున్నాయా.? అనే చర్చ మొదలయింది..
వర్మ వ్యూహం పూర్తిగా రాజకీయ కుట్రలతో తెరకెక్కిన చిత్రం.. ఈ సినిమాను తాను వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ నిజజీవితాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆయన జీవితంలోని కీలకమైన ఘట్టాలను తెరకెక్కిస్తున్నానని ఇప్పటికే వందలమార్లు చెప్పారు.. రెండు పార్టులుగా రూపొందుతోన్న ఈ బయోపిక్‌లో మొదటి పార్ట్ వ్యూహం, రెండో పార్ట్ శపథం.. ఇప్పటికే, వర్మ వ్యూహం టీజర్, ట్రయిలర్ కూడా రిలీజ్ అయ్యాయి.. త్వరలోనే విడుదలకు రెడీ అవుతున్నాయి.. అందులో భాగంగానే సెన్సార్ కోసం దరఖాస్తు చేసుకున్నారు చిత్ర దర్శకనిర్మాతలు..
సినిమాని వీక్షించిన తర్వాత వర్మ వ్యూహం మొత్తం వ్యక్తిగత వ్యవహారాలు, మనోభావాలు కించపరిచే విధంగా ఉన్నాయని సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ నిరాకరించిందని తెలుస్తోంది.. ఈ సినిమాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, రాజకీయ వారసుడు లోకేష్‌తోపాటు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పాత్రలను వక్రీకరిస్తూ పలు సీన్లు తెరకెక్కించారని టీజర్, ట్రయిలర్‌లోనే అర్ధం అవుతోంది.. ఇవే ఇప్పుడు వర్మ వ్యూహానికి నెగిటివ్‌గా మారుతున్నాయనే చర్చ మొదలయింది.. ఈ దృశ్యాలను వీక్షించిన తర్వాతే సర్టిఫికెట్ జారీ చేయలేమని తేల్చి చెప్పినట్లుగా సమాచారం..
అయితే, సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్‌పై వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ నిప్పులు చెరుగుతున్నారట.. దీనిపై ఆయన రివైజింగ్ కమిటీకి దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.. అయితే, దాసరి కిరణ్ కుమార్ రివైజింగ్ కమిటీకి దరఖాస్తు చేసుకున్నా… కొన్ని సీన్లకి కత్తెర తప్పదని ఫిల్మ్ నగర్ టాక్.. వైసీపీ మెప్పు కోసం వర్మ శృతిమించి చేసిన సీన్లకు కట్ చెబుతారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.. మరి, వర్మ వ్యూహం సెన్సార్ కత్తెరకి బలి అవుతుందా.?? లేదా.? అనేది త్వరలోనే తేలనుంది..