వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి, జగన్ వదిలిన బాణం…. వైఎస్ షర్మిల తెలంగాణ ఎన్నికలలో పోటీ నుండి తప్పుకున్నారు.. గత కొన్నాళ్లుగా తెలంగాణ ఎన్నికలలో తన ముద్ర వేయాలని, రాజన్న రాజ్యం తీసుకురావాలని అలుపెరగని పోరాటం చేశారు షర్మిల.. ఆమె ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అయితే, ఆశించిన మేర ఫలితాలను ఆమె సాధించలేకపోయారు.. చివరికి కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేసి, ఆ పార్టీ తరఫున బరిలోకి దిగాలని భావించారు.. షర్మిలకు కాంగ్రెస్‌లోని రాజకీయ వాతావరణం కలిసి రాలేదు.. ఆమెకు ఝలక్ ఇచ్చింది ఓ వర్గం.. చివరివరకు సోలోగా అయిన బరిలోకి దిగాలని భావించిన షర్మిలకు లాస్ట్ మినిట్‌లో అన్న జగన్ ఊహించని షాక్ ఇచ్చారని సమాచారం.. ఆయన నుండి ఊహించని సమాధానం రాకపోవడంతోనే షర్మిల పోటీకి వెనక్కి తగ్గినట్లు రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది..
రెండు రోజుల క్రితం అమరావతిలో వైఎస్‌ఆర్ ఎచీవ్ మెంట్ అవార్డులు ప్రకటించింది జగన్ సర్కార్.. తన తండ్రి పేరు మీద రాష్ట్రంలోని వివిధ రంగాలలో చేసిన కృషికి ఈ అవార్డులను ప్రతి ఏటా ప్రకటిస్తోంది జగన్ ప్రభుత్వం.. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి జగన్ తల్లి వైఎస్ విజయమ్మ కూడా హాజరయ్యారు.. ఇదే సందర్భంలో విజయమ్మ.. షర్మిలకు దక్కాల్సిన ఆస్తులు, తెలంగాణలో ఆమె పోటీకి కావల్సిన నిధులపై సుదీర్ఘ చర్చ నడిచినట్లు తెలుస్తోంది.. తల్లి విజయమ్మ కోరినా, జగన్ కనికరించలేదట.. ఆస్తుల విభజన, షర్మిలకు నిధులపై జగన్ సైలెంట్‌గా ఉన్నారట.. ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం..
అన్న సమాధానాన్ని తల్లి ద్వారా తెలుసుకున్న షర్మిల.. వెంటనే తెలంగాణలో తాను పోటీ నుండి తప్పుకోవడానికే మొగ్గు చూపినట్లు సమాచారం.. తెలంగాణలో కాంగ్రెస్ కి గెలిచే అవకాశాలు ఉన్నాయని, తాను బరిలోకి దిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని వివరించారు వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల. తాము తీసుకున్న ఈ నిర్ణయం ఏ పార్టీ కోసం కాదు,తెలంగాణ ప్రజల కోసం తీసుకుంటున్న నిర్ణయమని తెలిపారు.. తాము పోటీ చేస్తే కేసిఆర్ కి లాభం జరుగుతుందని మేదావులు చెప్పారని అందుకే విరమించుకునట్లు ప్రకటించారు.. కాంగ్రెస్ పార్టీ కి YSRTP మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని క్లారిటీ ఇచ్చారు షర్మిల.
మొత్తమ్మీద, జగన్ ఆర్ధిక సహాయ, సహకారాలు లేకపోవడంతోనే షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. మరి, ఆమె నిర్ణయం ఏ పార్టీకి కలిసివస్తుందో చూడాలి..