అమరావతి రాజధానిలో అసైన్డ్ భూములు కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ జీవో ఇవ్వడం ద్వారా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారంటూ ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీఐడీ 41 సీఆర్పీసీతోపాటు అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. చంద్రబాబుతోపాటు ఆయన క్యాబినెట్లో పురపాలక మంత్రిగా పని చేసిన నారాయణకు కూడా సీఐడీ నోటీసులు జారీ చేసింది. దీనిపై టీడీపీ లీగల్ సెల్ స్పందించింది. చంద్రబాబు, నారాయణకు సీఐడీ ఇచ్చిన నోటీసులపై రేపు హైకోర్టులో స్క్వాష్ పిటీషన్ దాఖలు చేయనున్నట్లు టీడీపీ లీగల్ సెల్ ప్రకటించింది.
ఈ నెల 23వ తేదీన విజయవాడలోని సీఐడీ ఆఫీసులో హాజరు కావాలంటూ చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. అమరావతి రాజధాని భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని ఇప్పటికే హైకోర్టు ఓ తీర్పులో స్పష్టం చేసింది. అయినా సీఐడీ కేసులు పెట్టడంపై ప్రతిపక్ష నేత హైకోర్టులో స్క్వాష్ పిటీషన్ వేయాలని నిర్ణయించుకున్నారు. కోర్టు ఇచ్చే తీర్పును బట్టి సీఐడీ ముందు హాజరుకావాలా, లేదా అనేది టీడీపీ లీగల్ సెల్ నిర్ణయించనుంది.
Must Read ;- కేసులతో చంద్రబాబు గడ్డం మీద వెంట్రుక కూడా పీకలేరు : నారా లోకేష్