పుత్ర వియోగం పొందిన ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుటుంబాన్ని బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. మాగంటి బాబు కుమారుడు రాంజీ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చెరుకున్న చంద్రబాబు రోడ్డుమార్గంలో ఏలూరు వెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికి జైబాబు, జైజై బాబు నినాదాలు చేశారు.
Must Read ;- నాడు ముద్దులు,నేడు పిడిగుద్దులు.. అమరావతి మహిళా రైతులను పరామర్శించిన చంద్రబాబు