వైస్ఆర్ సీపీలో వర్గ విభేదాలు గుప్పుమంటున్నాయి. వైసీపీకి చెందిన అత్తా కోడళ్లు జమ్మల మడుగు చైర్ పర్సన్ పదవికి పోటీ పడుతున్నారు. నువ్వా-నేనా అన్నట్లు ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే అత్తకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మద్దతు ఇవ్వడంతో, కోడలు జ్ఞానప్రసూన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. ‘పార్టీలో బీసీలకు, మహిళలకు న్యాయం చేకూరడం లేదని, చైర్ పర్సన్ పదవిని ఎమ్మెల్యే అమ్ముకున్నారని. టీడీపీ నుంచి పార్టీలో చేరినవారికే ప్రాధాన్యం ఇస్తున్నారని’ ప్రసూన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Must Read ;- మంత్రి బొత్స VS ఎమ్మెల్యే కోలగట్ల.. విజయనగరం మేయర్ పీఠానికి ఫైట్











