పశ్ఛిమగోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు రాంజీ విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందతున్నారు. బుధవారం అస్వస్థతకు గురైన రాంజీని ఏలూరులోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా కార్డియాక్ అరెస్టు కావడంతో వెంటనే విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా రాంజీ ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Must Read ;- మనిషి తలరాతలు తాళపత్రాల్లో రాసి ఉంటాయా?