ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేసిన జగన్ ప్రభుత్వం.. హింసను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. కృష్ణా జిల్లాలో వైసీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడిన టీడీపీ కార్యకర్త సోమయ్య చికిత్స పొందుతూ మరణించడం పట్ల చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ‘ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని జగన్ రెడ్డి రావణ కాష్టం చేస్తున్నాడు. స్వేచ్ఛగా జరగాల్సిన ఎన్నికలను రక్తసిక్తం చేసి, రాక్షసానందం పొందుతున్నాడు’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. సోమయ్య మరణానికి సీఎం జగనే బాధ్యత వహించాలన్నారు. ‘రాష్ట్రంలో ఇంకెన్నాళ్లీ హత్యా రాజకీయాలు? దాడికి పాల్పడి, ప్రాణాలు తీసిన వారిపై తక్షణమే హత్య కేసు నమోదు చేయాలి. మృతుడి కుటుంబానికి భరోసా కల్పించాలి అని డిమాండ్ చేశారు.
నేడు కుప్పంలో చంద్రబాబు పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబు గురు, శుక్రవారాల్లో తన నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి విమానంలో బెంగళూరు చేరుకుని, అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా కుప్పం చేరుకున్నారు. శుక్రవారం శాంతిపురం, రామ కుప్పం మండలాల పార్టీ నేతలతోనూ, అదే రోజు రాత్రి కుప్పం పట్టణ నేతలతోనూ సమావేశం అవుతారు. సోమవారం ఉదయం అమరావతికి తిరిగి వస్తారు.
Must Read – కుప్పంలో వైసీపీ అరాచకాలు.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్..











