స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు సాధ్యం కాని పంచాయతీల్లో వైసీపీ నేతలు కొత్త అరాచకాలకు తెర తీశారు. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో స్వయంగా వాలంటీర్లు రంగంలోకి దిగారు. ప్రతి నెలా వాలంటీర్లు పింఛన్ లబ్దిదారులకు నగదు అందిస్తూ ఉంటారు. ఎవరు పింఛను తీసుకుంటున్నారో వారికి స్పష్టంగా తెలసిపోతోంది. దీంతో వినుకొండ నియోజకవర్గం కారుమంచి వైసీపీ నేతలు వాలంటీర్లను రంగంలోకి దింపారు. టీడీపీకి పట్టున్న కారుమంచి గ్రామంలో సర్పంచ్ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని వైసీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. స్వయంగా వాలంటీర్లు పింఛను తీసుకునే వారిని వైసీపీకి ఓటు వేయకపోతే ఎన్నికల తరవాత పింఛను, రేషన్ తీసివేస్తామని బెదిరింపులకు దిగడం కలకలం రేపుతోంది.
సంక్షేమం ఎటుబోయింది
దేశంలో ఎవరూ చేయనన్ని సంక్షేమ పథకాలు చేపట్టామని చెప్పుకునే వైసీపీ నేతలకు పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుంది. ఎలాగైనా బెదిరించి పంచాయతీలను కైవసం చేసుకోవాలని ఎత్తులు వేస్తున్నారు. ముందుగా నామినేషన్లు వేయకుండా ఏకగ్రీవం చేసుకోవాలని బెదిరింపులకు దిగుతున్నారు. ఒక వేళ గెలిచినా వైసీపీ అధికారంలో ఉందని, ఎలాగైనా తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. బెదిరింపులకు లొంగకుండా నామినేషన్లు వేస్తే, తరువాత పింఛనుదారులను బెదిరిస్తున్నారు. దీంతో కేవలం పింఛనుపై ఆధారపడి జీవిస్తున్న వృద్ధులు, వితంతువులు,దివ్యాంగులు వాలంటీర్ల బెదిరింపులతో బెంబేలెత్తిపోతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు.
Must Read ;- బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోండి: చంద్రబాబు