తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంట గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సబ్బేళ్ల పుష్పవతి భర్త శ్రీనివాస్ రెడ్డిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అపహరించి గోవిందపురం అడవిలో కాళ్లు చేతులు కట్టి వదిలేశారు . తెలుగుదేశం సర్పంచ్ అభ్యర్థి దీనిపై తీవ్రంగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నామని అధికార పార్టీ వారు బెదిరిస్తున్నారని అంతేకాకుండా నా భర్తను కిడ్నాప్ చేసి గోవిందపురం అడవిలో వదిలివేస్తే పశువుల కోసం వెతుక్కుంటూ వెళ్ళినవారు కాపాడారని భార్య మీడియాకు వెల్లడించింది.
బెదిరించి.. కిడ్నాప్ చేశారు..
అర్ధరాత్రి రెండు గంటలకు బయటకు వస్తే తనని గుర్తు తెలియని వ్యక్తులు వెనకనుండి వచ్చి మత్తు ఇచ్చి తీసుకెళ్లి దూరంగా గోవిందపురం అడవిలో వదిలేశారని పశువులు కాసుకునే వాళ్ళు చూసి ఉదయం విడిపించారని శ్రీనివాస్ రెడ్డి వివరించారు. గత నాలుగు రోజులుగా మమ్మల్ని అధికార పార్టీ వారు మీరు ఓడిపోతారు పోటీ చేయకండి అని బెదిరిస్తున్నారు. కానీ ఎక్కడా తగ్గకుండా నామినేషన్ వేయడానికి సిద్ధపడ్డడంతో అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేశారని.. కానీ నామినేషన్ వేయకుండా తమని వారు అడ్డుకోలేకపోయారని అభ్యర్థి వెల్లడించారు.
Must Read ;- బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోండి: చంద్రబాబు