ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ శాస్త్రవేత్త, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మాజీ డైరెక్టర్ జనరల్ (డిజి) సౌమ్య స్వామినాథన్ యువతిగా తాను ఎదురుకున్న ఇబ్బందుల గురించి పేర్కొన్నారు. 2020 లో గ్లోబల్ హెల్త్ కాన్ఫరెన్స్, ఫోర్త్ విమెన్ లీడర్ సమావేశంలో మాట్లాడిన ఆమె తన కెరీర్ బిగినింగ్ లో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ పరిశోధనా సంస్థలో తన వృత్తిని ప్రారంభించినప్పుడు మేల్ డామినేషన్ ఎక్కువగా ఉండేదని విచారాన్నివ్యక్తం చేశారు. తాను చెప్పిన వాటిని పరిగణనలోకి తీసుకుపోవడమే గాక ఎగతాళి చేయడం లాంటి అనుభవాలు తనకు ఎదురయ్యాయని ఆమె పేర్కొన్నారు.
ఓ మహిళగా తాను చెప్పిన విషయాలేవి పరిగణనలోకి తీసుకోకపోవడంతో మన సంస్థలు పనిచేసే విధానం ఇదేనని అభిప్రాయానికి వచ్చానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వరుస పరిణామాలతో తరువాత అభిప్రాయాన్ని కూడా చెప్పలేదని ఆమె పేర్కొన్నారు. ఆమె మొదట చెన్నైలోని క్షయ పరిశోధన కేంద్రంలో పని చేశారు. ఆ తరువాత ఢిల్లీ, టాటా ఇన్స్టిట్యూట్ అధినేత అయ్యారు. మహిళా పరిశోధకులకు గ్రాంట్లు కూడా ఆమోదించడం మరింత కష్టమని అభిప్రాయ పడ్డారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని మహిళలు కూడా తమ ఫలితాలను పత్రికలలో ప్రచురించడంలో అడ్డంకులను ఎదుర్కొన్నారని స్వామినాథన్ పేర్కొన్నారు. ఇప్పటికీ మహిళలు వివక్ష ఎదురుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ గా ఉన్న సమయంలో తన అనుభవాలను ఆమె గుర్తు చేసుకున్నారు. ఇంటర్-డిసిప్లినరీ విధానాన్ని అవలంబించి, నర్సులతో పాటు వైద్యులు మరియు సామాజిక కార్యకర్తల దృక్పథాలను పరిగణనలోకి తీసుకున్నానని వెల్లడించారు.
థర్డ్ జెండర్ కమ్యూనిటీ యొక్క ఆందోళనల గురించి తన సిబ్బందికి తెలిసేలా చేశానని స్వామినాథన్ చెప్పుకొచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌమ్య స్వామినాథన్‌ను 2019 మార్చిలో ప్రపంచ ఆరోగ్య సంస్థలో చీఫ్ సైంటిస్ట్‌గా నియమించిన సంగతి తెలిసిందే. డబ్ల్యూహెచ్‌ఓ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పదవిని నిర్వహించిన మొదటి భారతీయరాలే గాక మొదటి భారతీయ మహిళగా స్వామినాథన్ నిలిచారు. కరోనా మహమ్మారి వ్యాప్తి జాతీయ మరియు ప్రపంచ స్థాయిలో నిర్ణయాలు తీసుకునే సంస్థలలో పురుషులతో పోలిస్తే మహిళలకు సమాన ప్రాతినిధ్యం లేని విషయం గర్హనీయమని విచారాన్ని వ్యక్తం చేశారు.
ఆమె చెప్పిన విషయాన్ని బ్రిటిష్ మెడికల్ జర్నల్ తాజా అధ్యయనం కూడా నిర్దారించడం విశేషం. ఆ అధ్యయనం ప్రకారం ప్రపంచ ఆరోగ్య శ్రామిక శక్తిలో మహిళలు 70% ఉన్నారని కానీ సీనియర్ నిర్ణయాత్మక పాత్రలలో 25% మాత్రమే ఉన్నారని తెలిసింది. మన దేశంలో కూడా సీనియర్ నిర్ణయాత్మక పాత్రలలో 14.3% మంది సభ్యులు మాత్రమే మహిళలు ఉన్నారని ఈ అధ్యయనం సూచించింది.











