ప్రధానంగా నాలుగు ప్యానెల్స్ పోటీ పడుతున్నాయి. తెలుగు సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ మన ప్యానెల్ తరపున పోటీ చేస్తుండగా, నటుడు ఓ.కల్యాణ్ సత్యమేవ జయతే ప్యానెల్ పై పోటీకి నిలబడ్డారు. ఇంకా వినోద్ బాల, కొమర వెంకటేష్ ప్యానెల్స్ కూడా పోటీలో ఉన్నాయి. 11 మంది సభ్యులతో కూడిన సొసైటీ నాయకత్వం కోసం ఈ ఎన్నికలు వాడీ వేడిగా జరుగుతున్నాయి.
చిత్రపురిలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని, నిధుల దోపిడీని వెలికితీస్తామని పోటీ దారులు ఎవరి తరహాలో వారు ప్రచారం సందర్భంగా హామీలిచ్చారు. దాదాపు 4,800 ఓట్లు ఈ సొసైటీ లో ఉన్నాయి. గురువారం సాయంత్రానికే ఎన్నికల ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటివరకు
వి వి.వినాయక్, గిరిబాబు, భానుచందర్ తదితరులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఓట్లు వేశారు. ఎన్నికల అధికారిణి గా అరుణ వ్యవహరిస్తున్నారు.
Must Read ;- ఇదేం వి‘చిత్రపురి’.. అసలు సభ్యులకు ఉరి?











