ఉమ్మడి ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ మరణం పట్ల సీజేఐ జస్టీస్ ఎన్వీ రమణ సంతాపం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా ఇవాళ ఎస్వీ ప్రసాద్ తుదిశ్వాస విడిచారు. ప్రసాద్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఎన్వీ రమణ. నిరంతరం ప్రజాహితం కోసం పరితపించిన నిజాయితీపరుడైన అధికారిగా ఎస్వీ ప్రసాద్ చిరకాలం గుర్తుండి పోతారన్నారు. ఆయన క్రమశిక్షణ, బాధ్యతయుతమైన విధులు, దక్షత నేటి తర అధికారులకు ఆదర్శం కావాలని అన్నారు. ఎస్వీ ప్రసాద్ అలాంటివాళ్లు ఉంటే.. ప్రభుత్వ పనులు చురుగ్గా సాగుతాయని అన్నారు. ఆయన మరణం తీరని లోటు అని ఎన్వీ రమణ అన్నారు.
Must Read ;- సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. నెలలో నాలుగు విలక్షణ తీర్పులు











