ఆనందయ్య మందు పంపిణీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంతోమంది ఆనందయ్య మందు కోసం ఎంతోమంది కృష్ణపట్నానికి వస్తుండటంతో అధికారులు, ప్రజా ప్రతినిధులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆనందయ్యతో నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్‌బాబు సమావేశం నిర్వహించారు. ఆనందయ్య మందు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు త్వరలో ఆన్‌లైన్ ద్వారా ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని మీడియా తెలిపారు. మందు కోసం దూర ప్రాంతాల ప్రజలు ఎవరూ రావొద్దని స్పష్టం చేశారు.
Must Read ;- బాబా రాందేవ్ కన్నా ఆనందయ్యే ఎంతో బెటర్ : ఎన్ఆర్ఐ రాజ్ బోడా వ్యాఖ్యలు










