ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ కొన్నిరోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. చికిత్స నిమిత్తం ఆయన యశోద ఆస్పత్రిలో చేరారు. ఆయన పరిస్థితి విషమించడంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈయన 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. రోశయ్యతో పాటు చంద్రబాబు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో సీఎస్ గా పని చేశారు. క్రమశిక్షణ కలిగిన ఉన్నతాధికారిగా ఎస్వీ ప్రసాద్ కు పేరుంది. ఎస్వీ ప్రసాద్ మృతిపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తీరని లోటు అని చంద్రబాబు అన్నారు.
Must Read ;- నేటితరం అధికారులకు ఆదర్శం ఎస్వీ ప్రసాద్ : సీజేఐ ఎన్వీ రమణ










