అమరావతి రాజధాని గ్రామం వెలగపూడిలో గతరాత్రి తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఎస్సీ కాలనీకి ఆర్చ్ నిర్మాణం విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. వివాదం చిలికిచిలికి గాలివానలా మారింది. అర్థరాత్రి ఎస్సీలు రెండుగా విడిపోయి రాళ్లు రువ్వుకున్నారు. ఈ వివాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఒకరు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఘటన పునరావృతం కాకుండా వెలగపూడి గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.
Must Read ;- ఎంపీ నందిగం సురేష్‌తో ప్రాణహాని.. సీఎం రక్షణ కోరిన బాధితుడు