ఏలూరులో అంతుచిక్కని వ్యాధిలో వందలాది జనాలు హాస్పిటల్ పాలైన సంగతి తెలిసిందే. ఇప్పటికి కూడా వ్యాధి కారణాలపైన స్పష్టత రాలేదు. అదే తరహాలో నిన్నటికి నిన్న నెల్లూరు కొందరు వలస కూలీలు నాట్లు పడిపోయిన సంగతి తెలిసిందే. అదే తరహాలో గుంటూరు కూడా కొందరు అస్వస్థతకు గురవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
నడుకుడి గ్రామానికి చెందిన రామక్రిష్ణ అనే యువకుడు హఠాత్తుగా స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. అదే తరహాలో మరో ఇద్దరు యువకులు కూడా స్పృహ కోల్పోయి ఆసుపత్రిలో చేరడంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. ఆసుపత్రిలో చేరిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల కధనం ప్రకారం, చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల నుండి విడుదలవుతున్న వ్యర్ధాల వల్ల నీళ్లు కలుషితమవడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని చెప్తున్నారు. ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అసలెందుకిలా?
మొన్న ఏలూరు, నిన్న నెల్లూరు, నేడు గుంటూరు.. మరి రేపే ఏం వినాల్సి వస్తుందో తెలియడం లేదు. ఏలూరు సంఘటన జరిగి రోజులు గడుస్తున్నా, ఇంకా పరిశోధన చేయాలి అప్పుడే చెప్పగలం అంటున్నారు రాష్ట్ర ఆరోగ్య కమీషనర్. బ్లడ్ శాంపిల్స్ లో లెడ్, నికిల్ ఉన్నాయని తేలింది, కానీ అవి వేటి ద్వారా వారి శరీరంలోకి చేరాలో చెప్పలేకపోతున్నారు నిపుణులు. నీటి ద్వారా కాదని రాష్ర్ట ఆరోగ్య కమీషనర్ తేల్చి చెప్పారు. మరెలా అంటే.. పరిశోధనలు చేస్తున్నాం అంటున్నారు. దేశాన్నే కుదిపేసిన సంఘటనలో ఇంతటి నిర్లక్ష్యామా అంటున్నారు ప్రజలు. మరి గుంటూరు అస్వస్థతల కారణం ఎప్పటికి తెలుస్తుందో చూడాలి?
Must Read ;- వామ్మో ఏలియన్స్.. మానవాళికి పెవిలియన్ బాటేనా?











