ఒకవైపు దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం.. మరోవైపు ఆక్సిజన్ కొరత అధికంగా ఉన్న నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరిపోస్తోంది. వద్దనుకున్న ప్లాంటే ప్రాణావాయువును అందిస్తూ, ప్రాణాలు నిలుపుతోంది. మహారాష్ట్రలో కరోనా ఉధృతంగా ఉండి, ఆక్సిజన్ కొరత ఉండటంతో విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు నుంచి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను పంపాలని అధికారులు నిర్ణయించారు. దీంతో దేశంలోనే మొట్టమొదటి ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు’ విశాఖపట్నం నుంచి గురువారం రాత్రి మహారాష్ట్ర బయలుదేరింది.
నష్టాలను సాకు చూపి..
విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు నష్టాల్లో ఉందని, అమ్మేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ ప్రజలు, ప్రతిపక్ష నాయకులు వ్యతిరేకిస్తూ, కార్మికులు నిరాహార దీక్షలు చేశారు. అయితే దీక్షల సమయంలో కేంద్రం కన్నెత్తి కూడా చూడలేదు. ఇప్పుడు మాత్రం విశాఖ స్టీల్ ప్లాంటు నుంచి ఆక్సిజన్ తరలిస్తోంది. సొంత ప్రయోజనాలకు స్టీల్‌ప్లాంటును వాడుకుంటున్న కేంద్రం ఎందుకు ప్రైవేట్ పరం చేస్తుందని ప్రజలు, అన్ని పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా కేంద్రం మనసు మార్చుకోవాలని కోరుతున్నారు.
Must Read ;- బలిపీఠంపై ఉన్నా.. ప్రాణ దాతగా నిలిచిన విశాఖ ఉక్కు