తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని విజిట్ చేశారు. అయితే ఆయన గాంధీని ఏ తరహాలో విజిట్ చేశారో.. ఎంజీఎంను కూడా అలాగే సందర్శించారు. పీపీఈ కిట్ లేకుండా, డబుల్ మాస్క్ ధరించి ఆస్పత్రిని పరిశీలించారు. కొవిడ్ రోగులకు అందుతున్న వైద్య సేవలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో బెడ్స్, ఆక్సిజన్, మందుల కొరతపై కేసీఆర్ వైద్యాధికారులతో చర్చించారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ లో కరోనా కేసులు ఎక్కువగా కరోనా కేసులు పెరుగుతుండటంతో.. కరోనా కట్టడిపై కేసీఆర్ సమీక్ష జరపనన్నారు. అయితే ఎంజీఎంలో ప్రధానంగా సిబ్బంది కొరత ఉండటంతో..కేసీఆర్ డాక్టర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఏమైనా ఇస్తారా.. ఎంజీఎం వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి లు ఉన్నారు.
Must Read ;- గాంధీలో సీఎం : కరోనా రోగులకు ధైర్యం చెప్పిన కేసీఆర్