ఆంధ్రప్రదేశ్ సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడారంటూ లీగల్ రైట్స్ అడ్త్వైజరీ కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే సునీల్ కుమార్ మాట్లాడిన వీడియోలు ఒక్క సారిగా సోషల్ మీడియా నుంచి మాయం అయ్యాయి. ఈ వీడియోలు సాక్ష్యంగా ఉంటాయనే ఆలోచనతోనే వాటిని కావాలని డిలీట్ చేశారని ఎల్‌ఆర్‌పీఎఫ్ ఆరోపించింది. సునీల్ కుమార్ ఎస్సీ రిజర్వేషన్ ఉపయోగించుకుని ఉద్యోగం పొంది, తరవాత మతం మారారని ఇటీవల మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అతను ఉద్యోగానికి అనర్హుడని లీగల్ రైట్స్ అడ్వైజరీ కన్వీనర్ ఎన్ ఐ జోషి కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు.సునీల్ కుమార్ చేసిన ప్రసంగాల వీడియోల లింకులను కూడా అతని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆ వీడియోలు మాయం కావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
సునీల్ కుమార్ చుట్టూ ముసురుతున్న వివాదాలు
వైసీపీ ఎంపీ రఘురామరాజును అరెస్టు చేయడంలో కీలకంగా వ్యవహరించిన సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్‌పై అనేక వివాదాలు చుట్టుముడుతున్నాయి. తన ఫోన్ స్వాధీనం చేసుకుని దాని నుంచి ఇతరులకు మెసేజ్‌లు పంపుతున్నారంటూ ఎంపీ రఘురామరాజు కూడా ఢిల్లీలో ఫిర్యాదు చేశారు. మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్, వారి కుటుంబ సభ్యులకు తన వద్ద స్వాధీనం చేసుకున్న ఫోన్ ద్వారా పలుమార్లు సందేశాలు పంపాడని సునీల్ కుమార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘురామరాజు ఫిర్యాదులో కోరారు.
Must Read ;- ఫోన్ ఇస్తారా.. లేదా? : లీగల్ నోటీసులు పంపిన ఎంపీ రఘురామరాజు











