గత రెండుమూడు రోజులుగా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై విమర్శలు వస్తున్నాయి. హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారనే ఆరోపణలే అందుకు కారణం. ఆయన తీరును నిరసిస్తూ హిందు సంఘాల నాయకులు మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్యకు ఫిర్యాదు చేశారు. ప్రవీణ్‌కుమార్‌పై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ధూళికట్టలో వందలాది మంది చేసిన ప్రతిజ్ఞపై నోటీసులు జారీ చేయాలని కోరారు. హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసినవాళ్లలో ఎంవీఆర్ శర్మ, మంగపతిరావు, కృష్ణమోహన్, నరేశ్, హనుమంతచారి, చంద్రమౌళి, శ్రీకాంత్‌శర్మ ఉన్నారు. ఈ విషయమై దళిత సంఘాలు స్పందిస్తూ ప్రవీణ్ కుమార్ ఉద్దేశపూర్వకంగా ప్రతిజ్ఞ చేయించలేదంటూ ఆయనకు మద్దతు ఇస్తున్నాయి.
Must Read ;- దేవుడా.. నీకు నువ్వే దిక్కు..











