నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు అభ్యర్ధిని ప్రకటించి ప్రత్యర్థుల కన్నా ముందున్న కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా దూసుకుపోతోంది. ఈ రోజు జనగర్జన పేరుతో హాలియాలో భారీ బహిరంగసభ నిర్వహించి కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిని నాయకులు వివరించారు. సాగర్ అభ్యర్థి జానారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి గడప తనకు తెలుసని అన్నారు. కేసీఆర్ తాను సాగర్‌కు ఏమిచేయలేదంటున్నారని, ఆయన వస్తే తానేం చేశానో ఛూపిస్తానని జానారెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తాము పదవులనే త్యాగం చేశామన్నారు. సాగర్ ద్వారా ఆరున్నర లక్షల ఎకరాలకు తాము సాగునీరిచ్చామన్నారు.
టీఆర్ఎస్ పాలనలో చేసిందేమి లేదు..
అంతకు ముందు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ సాగర్‌కు చేసిందేమి లేదని కేసీఆర్ అంటున్నారని, ఏడేళ్లలో టీఆర్‌ఎస్ ఏమి చేసిందో చూపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హాయాంలో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని ఉత్తమ్ అన్నారు.
Must Read ;- సాగర్‌లో అసమ్మతి.. బీజేపీ, టీఆర్ఎస్‌ల్లో టెన్షన్