Pegasus Spyware :
మీ ప్రమేయం లేకుండా.. మీకు మిస్డ్ కాల్ రావొచ్చు. ‘మిస్డ్ కాల్ కదా’ ఏమవుతుందిలే అని రిప్లై ఇచ్చారా.. ఇక అంతే సంగతులు. కొద్ది నిమిషాల్లోనే ఫోన్ హ్యాక్ అవుతుంది. ‘ఈరోజుల్లో హ్యాకింగ్ కామనే కదా’ లైట్ గా తీసుకుంటే కొంపలు మునిగినట్టే.. మనకు తెలియకుండా మన డేటా అంతా ఇతరులకు చేరుతుంది. ఒక్కసారి హ్యాక్ అయితే.. మనం రోజు ఏంచేస్తున్నామో అంతా రికార్డ్ అవుతుంది. చివరకు పడక గది వ్యవహరాలు సైతం వీడియో రూపంలో వెళ్తాయి. ఇంతగా భయపెట్టే కొత్త సాఫ్ట్ వేర్ ఏంటిదబ్బా అని అనుకుంటున్నారా..? అదే పెగాసస్ సాఫ్ట్ వేర్.
పెగాసస్ ఏంటే ఏమిటి?
ఇజ్రాయెల్‌కు చెందిన టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎన్‌ఎస్‌వో అభివృద్ధి చేసిన సాఫ్ట్ వేర్ ఇది. ఆండ్రాయిడ్ మొబైళ్ల నుంచి రహస్యంగా సమాచారం సేకరించేందుకు ఉపయోగపడుతుంది. ఈ మాల్‌వేర్ లేదా స్పైవేర్ ఉన్న స్మార్ట్ ఫోన్లు కెమెరా నియంత్రణ ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. అంతేకాదు.. ఈ–మెయిళ్లు, లొకేషన్ సైతం చేరుతుంది. ఇక ఆడియో, వీడియోలు, మెసేజీలు (వాట్సాప్, ఫేస్ బుక్) కూడా హ్యాక్ అవుతాయి. ఒకవేళ దీని బారిన పడితే.. ఫోన్ ఆప్ డేట్ చేసినా, పాస్ వర్డ్ మార్చినా ఫలితం ఉండదు. నంబర్ తో సహా మొబైల్ ను మార్చాల్సిందే.
వ్యవస్థలకు మాత్రమే
ఈ పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగం ప్రభుత్వాలు, ప్రభుత్వపరమైన కొన్ని సంస్థలు మాత్రమే వాడుకునే వీలుంది. ఉగ్రవాదం, నేరాల నిరోధమే లక్ష్యంగా తాము ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. 2017లో దుబాయ్ మానవహక్కుల కార్యకర్త అహ్మద్ మన్సూర్ తొలిసారి ఈ పెగసస్ సాఫ్ట్‌వేర్‌ను గుర్తించారు. అప్పట్లో ఆయన స్మార్ట్‌ఫోన్ కూడా ఈ మాల్‌వేర్ బారినపడటంతో ఈ విషయం బయటకొచ్చింది.
పార్లమెంట్ లో రచ్చ రచ్చ
ఇండియా ‘పెగాసస్’ స్పై వేర్(Pegasus Spyware) ఉదంతం తీవ్ర సంచలనం రేపుతోంది. దేశంలోని ఆయా రంగాల ప్రముఖల ఫోన్లను ఈ సాఫ్ట్ వేర్ ద్వారా హ్యాక్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సరిగ్గా ఒకరోజు ముందు ఈ ఉదంతం తెరపైకి రావడం చర్చనీయాంశమవుతోంది. కేంద్రమంత్రులు, జర్నలిస్టులు, వ్యాపార వేత్తలు, ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాక్ చేసినట్లు ఆరోపణలు వస్తుండటంతో దీనిపై విచారణ జరిపించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. కేంద్ర హోంమంత్రి రాజీనామా చేయాలని ,ప్రధాని మోదీపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త పీకే ఫోన్లు సైతం హ్యాకింగ్ గురై అవకాశాలున్నాయని మీడియాలో కథనాలు రావడంతో పెద్ద దుమారమే రేపుతోంది.
Must Read ;- ‘మీడియాను కంట్రోల్ చేస్తున్న మోదీ!’