తెలంగాణలో పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ కరోనా విలయ తాండవం చేస్తుందని ములుగు ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో పేదలు ఎక్కడికి వెళ్లాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్పొరేట్ వైద్యం చేయించుకోలేక కళ్ల ముందు ఆప్తులను కోల్పోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె హైదరాబాద్ లో ఆదివారం నిరసన దిగారు. ఎన్ని నిరసనలు తెలిపినా ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. కరోనా ను కట్టడి చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీతక్క అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.
Must Read ;- కరోనా రోగులకు అండగా.. కాంగ్రెస్,రేవంత్











