కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు తుదిశ్వాస విడిచారు. ఈ మధ్యనే ఆయనకు కరోనా సోకడంతో చికిత్స నిమిత్తం నిమ్స్ లో చేరారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున ఎమ్మెస్సార్ కన్నుమూశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, మూడు పర్యాయాలు ఎంపీగా, 2004లో వైఎస్సార్ కేబినెట్‌లో ఎమ్మెస్సార్ మంత్రిగా పనిచేశారు. పీసీసీ అధ్యక్షులుగా కూడా ఆయన సేవలు అందించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితులు. నిత్యం సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుండేవారు. ఎమ్మెస్సార్ మరణంతో ఆయన స్వగ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర ఆయన స్వగ్రామం.
Must Read ;- వేమూరి రాధాకృష్ణకు సతీ వియోగం











