వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మరోసారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కళ్యాణ లక్ష్మీ, పింఛన్ల లాంటి పథకాలు పేదరిక సమస్యలను దూరం చేయలేవని ప్రభుత్వంపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కులం, డబ్బు, పార్టీ జెండాలను కాదు.. మనిషిని గుర్తుపెట్టుకోవాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఏకంగా పార్టీ జెండాను కాదు.. మనిషిని గుర్తుపెట్టుకోవాలంటూ సంచనల కామెంట్స్ చేశారు.
కేటీఆర్ తో భేటీ
ఈటల పార్టీలో ఇమడలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ కీలక భేటీలకు కూడా ఆయనకు ఆహ్వానం అందడం లేదని.. ఈటల దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలోనూ ఈటల ఎక్కడా కనిపించలేదు. అయితే ఈటల వ్యాఖ్యలు దుమారం రేపడంతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సోమవారం ఈటలతో భేటీ అయ్యారు. ప్రగతిభవన్ లో ఈటలతో మాట్లాడనున్నారు కేటీఆర్. గత కొన్ని రోజులుగా ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేస్తుండటంతో ఆయన పార్టీలో కొనసాగుతారా? లేదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Must Read ;- ఎమ్మెల్సీల విజయంతో విమర్శలకు చెక్.. బీజేపీకి బ్రేక్