ఏపీలో కొత్తగా కేసులు పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో సెకండ్ వేవ్ మొదలైన తర్వాత తొలిసారి 23వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇటు ప్రభుత్వాన్ని, అటు ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 1,14,299 పరీక్షలు నిర్వహించగా.. 23,920 కేసులు నిర్ధారణ కాగా.. 83 మంది చనిపోయాయినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు, ప్రజలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. రాజకీయాలపై ఉన్న శ్రద్ధ, ప్రజలపై లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మందులు, ఆక్సిజన్ కొరత వేధిస్తుండటంతో ఏపీలో భయనక వాతావరణం ఏర్పడింది.
Also Read:దూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్












