అవినీతి ఆరోపణలపై దూళిపాళ్లను అరెస్టు చేసిన ఏసీబీ, కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండుకు పంపిన విషయం తెలిసిందే. నాలుగు రోజులుగా దూళిపాళ్ల జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. దీంతో కరోనా పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ తేలితే ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటీషన్ వేశారు. దీంతో దూళిపాళ్లకు కరోనా టెస్టులు చేయించాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా పాజిటివ్ నిర్ధరణ అయితే వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని హైకోర్టు ఆదేశించింది.
Also Read:-సంగం డెయిరీని దెబ్బతీసేందుకే దూళిపాళ్ల అక్రమ అరెస్ట్ : చంద్రబాబునాయుడు
విజయవాడ ఆయుష్ కు దూళిపాళ్ల
హైకోర్టు ఆదేశాల మేరకు దూళిపాళ్ల నరేంద్రను తెల్లవారుజామున రాజమండ్రి నుంచి విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. ఇదేకేసులో నిందితుడిగా ఉన్న సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణ కూడా కరోనా భారిన పడ్డారు. దీంతో ఆయనను కూడా ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. మరో వైపు సంగం డెయిరీ జీఎం గురుమూర్తి కూడా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆయనకు కూడా ఇవాళ కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది.
Must Read:-ధూళిపాళ్లకు ఊరట : ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశం











