ఇది జగన్ రెడ్డి సంక్షేమ పథకాల విజయం కాదని, ప్రైవేట్ బస్సుల విజయం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీది దొంగ ఓట్లు, దొంగ నోట్ల విజయమని వ్యాఖ్యలు చేశారు. వందల కొద్ది బస్సులు, జీపులతో ఓటర్లను తరలించి విజయం దక్కించుకున్నాడని అన్నారు. తిరుపతిలో నైతికంగా గెలిచింది టీడీపీనే అని అన్నారు. నైతికంగా గెలిచామన్న సంతోషం వైసీపీ నేతల మొహాల్లోనే కనబడటం లేదన్నారు. సంక్షేమ పథకాలతో గెలిచామని చెబుతున్నా నాయకులు, తిరుమల సాక్షిగా ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరారు. ప్రజా సంక్షేమాని గాలికివదిలేసి, అక్రమ అరెస్టులతో రాక్షస ఆనందం పొందుతున్న జగన్ కు త్వరలో బుద్ది చెప్తామని అచ్చెన్నాయుడు అన్నారు.
Also Read:దొంగ ఓట్లు వేయలేదని ప్రమాణం చేయగలరా : అచ్చెన్నాయుడు











