రీసెంట్ గా విడుదలైన ‘జాతిరత్నాలు’ సినిమా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తూ.. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విరుచుకుపడుతోంది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ పండించిన కామెడీ కి ఉభయ రాష్ట్రాల ప్రేక్షకులు పడి పడి నవ్వుతున్నారు. ఈ సినిమా థియేటర్స్ వద్ద ఇంకా తన ప్రతాపం చూపిస్తోంది. ఇప్పటికి రూ. 25కోట్ల పైగానే షేర్ వసూలు చేసింది ఈ సినిమా. ఇక ఈ మూవీ పై టాలీవుడ్ సెలెబ్రిటీస్ ప్రసంశలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా సక్సెస్ కు మూల స్థంభంగా నిలిచిన నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ కు ఫిదా అవుతున్నారు.
ఇక ఈ సినిమా తెచ్చిపెట్టిన సూపర్ సక్సెస్ తో.. మన ఏజెంట్ ఆత్రేయ.. తన పారితోషికాన్ని ఓ రేంజ్ లో పెంచేశాడని చెప్పుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం నవీన్ కమిట్ అయిన కొత్త చిత్రానికి రూ. 2కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. రారా కృష్ణయ్య ఫేమ్ మహేశ్ పి. ఈ సినిమాకి దర్శకుడు. అనుష్క శెట్టి కథానాయిక. ఓకుర్రోడికి, మధ్య వయస్కురాలైన ఓ స్త్రీకి మధ్య ప్రణయమే ఈ సినిమా కథాంశం.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకోబోతున్న ఈ సినిమాకి.. నిజానికి నవీన్ .. జాతిరత్నాలు సినిమా కన్నా ముందే కమిట్ అయ్యాడట. ఆ సినిమా సూపర్ హిట్టవ్వడంతో ఇందులోని నవీన్ సన్నివేశాల నిడివిని కూడా పెంచుతున్నారట. అలాగే.. అతడు డిమాండ్ చేసిన పారితోషికాన్ని ఇవ్వడానికి అంగీకరించారట. అనుష్క శెట్టి లాంటి స్టార్ హీరోయిన్ సరసన నటించే అవకాశాన్ని అందుకున్న నవీన్.. ఈ మూవీతో ఏ రేంజ్ లో స్టార్ డమ్ పెంచుకుంటాడో చూడాలి.
Must Read ;- ‘జాతిరత్నాలు’ దర్శకుడితో ‘ఉప్పెన’ హీరో?











