వ్యాక్సిన్ వినియోగం, లాక్ డౌన్ నిబంధనలు పక్కగా అమలు చేయడంతో క్రమక్రమంగా అదుపులోకి వస్తోంది. దేశంలో దాదాపు 81 రోజుల తర్వాత చాలా తక్కువ స్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. దేశంలో నిన్న 58,419 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 87,619 మంది కోలుకోగా, దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,98,81,965కు చేరింది. మృతుల సంఖ్య మొత్తం 3,86,713కు పెరిగిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య బాగా పడిపోవడంతో లాక్ డౌన్ ను ఎత్తివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం పలు సూచనలు చేసింది. వైరస్ వ్యాప్తి తగ్గినా.. తప్పనిసరిగా మాస్కు, భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేసింది.
Must Read ;- వ్యాక్సిన్ ప్లీజ్ : ఇండియా సాయం కోరిన డబ్ల్యూహెచ్ ఓ











