కరోనా వైరస్ వ్యాప్తి క్రమక్రమంగా తగ్గుతోంది. ఫలితంగా పాజిటివ్ కేసులు, మరణాలు కూడా తగ్గుతున్నాయి. దేశంలో మొన్నటివరకు 80 వేలు కేసులు ఉండగా, తాజాగా 60 వేలకు పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో 60,471 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దేశంలో ప్రస్తుతం 9,13,378 యాక్టీవ్ కేసులు కేసులు ఉండగా, 2,726 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకుని 1,17,525 మంది డిశ్చార్జ్ అయ్యారు. కోలుకున్న వారి సంఖ్య 2,82,80,472గా ఉంది. ఇప్పటి వరకు 25,90,44,072 మంది టీకా తీసుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారికంగా వెల్లడించింది.
వైరస్ ప్రభావం తగ్గుతుండటంతో కొన్ని రాష్ట్రాల్లో పాక్షిక లాక్ డౌన్ కొనసాగిస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే లాక్ డౌన్ పై మరిన్ని సడలింపులు ఇచ్చింది. ఇక తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే మరిన్ని సడలింపులు ఇచ్చేందుకు యోచిస్తోంది. సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన నేపథ్యంలో పగలు లాక్ డౌన్ ఎత్తేసి, నైట్ కర్ఫ్యూ విధించే అవకాశాలు న్నాయి.
Must Read ;- కరోనా రోగులకు నిజాం మునిమనుమరాలు సాయం : పెయింటింగ్స్ వేస్తూ.. డబ్బులు సమకూరుస్తూ!











