కరోనా సెకండ్ వేవ్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఎంతోమంది ప్రాణాలను తీసుకుంది. వ్యాక్సిన్ వినియోగంతోనే కరోనాను చెక్ పెట్టేయొచ్చని పలు దేశాయిలు భావించాయి. అనేక దేశాలు యుద్ధప్రాతిపదికన వ్యాక్సిన్ తయారీ చేయించి, కరోనా బారిన నుంచి బయటపడే ప్రయత్నాలు చేశాయి. దీంతో క్రమంగా కేసులు తగ్గాయి. ఇండియా, యూఎస్, రష్యా లాంటి దేశాలు వ్యాక్సిన్ వినియోగంలో ముందుంటే.. కనీస వసతులు సమకూర్చుకోలేని పేద దేశాలు ఇప్పటికీ వ్యాక్సిన్ వినియోగానికి నోచుకోలేకపోతున్నాయి.
వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) ఇండియా సాయం కోరింది. నేపాల్, శ్రీలంకతో పాటు మరికొన్ని దేశాలు ఇప్పటికే కరోనాతో పోరాడుతున్నాయని, టీకా దొరకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపింది. ఈ మేరకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) నుంచి టీకాలు పంపాలని కోరింది. భారత్ నుంచి వ్యాక్సిన్ డోసులు పంపాలని డబ్ల్యూహెచ్ ఓ డైరెక్టర్ సలహాదారు బ్రూస్ ఐల్వార్డ్ పేర్కొన్నారు. అన్ని దేశాల పంపిణీకి మరో 20 కోట్లు డోసులు అవసరమని తెలిపారు.
Must Read ;- ఉగ్రవాదుల ముప్పు.. భారత్ బయోటెక్‌కు కమాండోల భద్రత











