సంగం డెయిరీ వ్యవహారంలో ఏసీబీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సంగం డెయిరీలో సెర్చ్ వారెంట్ రీకాల్ చేయాలంటూ ఏసీబీ అధికారులు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఏసీబీ అధికారులు వేసిన పిటీషన్‌ను కొట్టివేస్తూ ఏసీబీ స్పెషల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సంగం డెయిరీలో ఎలాంటి తనిఖీలు అవసరం లేదని కోర్టు తేల్చి చెప్పింది. ఇప్పటికే సంగం డెయిరీ ఆస్తుల స్వాధీనంపై ప్రభుత్వం ఇచ్చిన జీవోను కూడా హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. సంగం డెయిరీ స్వాధీనం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. సంగం డెయిరీ కార్యకలాపాలు కూడా పాలకవర్గం నిర్వహించుకోవచ్చని హైకోర్టు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.
వెంటాడుతున్నారు..
సంగం డెయిరీ వ్యవహారంలో కోర్టుల్లో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా వైసీపీ ప్రభుత్వం వెంటాడుతూనే ఉంది. ఓ వైపు సంగం డెయిరీలో తనిఖీల పేరుతో కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకోవడం, డేటాను తీసుకెళ్లడం వంటి చర్యలకు దిగుతున్నారు. తాజాగా సంగం డెయిరీలో ఎలాంటి తనిఖీలు అవసరం లేదని ఏసీబీ కోర్టు స్పష్టం చేయడంతో ఏసీబీ అధికారులకు షాక్ తగిలినట్టయింది.
Must Read ;- సంగం డెయిరీ పాలక మండలిపై మరో కేసు నమోదు