నరసాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు ఇవాళ ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాను కలిశారు. తనపై జరిగిన దాడి విషయంలో త్వరగా విచారణ జరిపి, కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగించిన సీఐడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఓం ప్రకాష్ బిర్లాకు విజ్ఙప్తి చేశారు. అనర్హత వేటుపై వైసీపీ ఎంపీల పిర్యాదును పరిగణనలోకి తీసుకోవద్దని రఘురామరాజు స్పీకర్‌ను కోరారని తెలుస్తోంది. ఫిరాయింపు నిరోధక చట్టం కింద తనపై చర్యలు తీసుకోవద్దని ఆయన స్పీకర్‌ను కోరారు. వైసీపీ అధికారిక వెబ్ సైటు నుంచి కూడా తన పేరు తొలగించారని ఆయన స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే..
వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే తనపై కక్ష కట్టారని ఎంపీ రఘురామరాజు స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకు వివరించారు. తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ వివరించారు. ప్రివిలేజ్ ప్రకారం తనపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘురామరాజు స్పీకర్‌కు విజ్ఙప్తి చేశారు.
Must Read ;- ఎంపీ రఘురామరాజు సభ్యత్వాన్ని రద్దు చేయండి : స్పీకర్‌కు ఫిర్యాదు











