సంగం డెయిరీ పాలకవర్గంపై విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది.గత నెల 29న విజయవాడ నొవాటెల్ హోటల్లో సంగం డెయిరీ పాలక మండలి సమావేశమైంది.ఈ సమావేశంలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ సంగం డెయిరీ ఛైర్మన్ దూళిపాళ్ల నరేంద్రతో పాటు డైరెక్టర్లపై కేసు నమోదు చేశారు. బెయిల్‌పై విడుదల తరవాత విజయవాడ కార్పొరేషన్ పరిధిలోనే నెల రోజులు అందుబాటులో ఉండాలని కోర్టు ఆదేశించడంతో సంగం డెయిరీ ఛైర్మన్ దూళిపాళ్ల నరేంద్ర బెజవాడలోనే ఉంటున్నారు. సంగం డెయిరీ వ్యవహారాలు పర్యవేక్షించేందుకు నొవాటెల్ హోటల్లో మే 29న పాలకమండలి సమావేశమైంది.ఈ సమావేశానికి 12 మంది మాత్రమే హాజరయ్యారు. అయినా విజయవాడ పటమట పోలీసులు కోవిడ్ నిబంధలను ఉల్లంఘించి సమావేశం నిర్వహించారంటూ సంగం డెయిరీ ఛైర్మన్ దూళిపాళ్ల నరేంద్ర సహా పాలక మండలి సభ్యులపై కేసు నమోదు చేశారు.
సామాజిక దూరం పాటించాం
పాలక మండలి సమావేశంలోనూ అందరూ మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించినట్టు సంగం డెయిరీ ఛైర్మన్ దూళిపాళ్ల నరేంద్ర ప్రకటించారు.అయినా కోవిడ్ నిబంధనల ప్రకారం అసలు సమావేశాల ఏర్పాటుకు అనుమతులు లేవని పోలీసులు కేసు పెట్టడాన్ని దూళిపాళ్ల నరేంద్ర తప్పు పట్టారు.ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మరో కేసు పెట్టిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Must Read ;- అమూల్‌కు ఇచ్చే అధికారం సర్కారుకు ఎక్కడిది: ఉమ