కోవాగ్జిన్, కోవిషీల్డ్.. ఇప్పటివరకు మనకు బాగా తెలిసిన కరోనా వాక్సిన్లు ఇవే. ఎక్కువగా వాడిన వ్యాక్సిన్లు కూడా ఇవే ఎక్కువ. వీటిలో ఏదీ బెటర్ అంటే కోవాగ్జిన్ అని అంటున్నారు ఆంథోనీ ఫౌసీ. భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్.. 617 కొవిడ్ వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేస్తుందని అమెరికా ప్రముఖ అంటువ్యాధుల నివారణ నిపుణుడు, డా. ఆంథోనీ ఫౌసీ అన్నారు. ఈమధ్య వాక్సిన్ తీసుకున్న డేటాను పరిశీలించిన తర్వాతే ఆయన స్పష్టం చేశారు. మంగళవారం కాన్ఫరెన్స్ కాల్ ద్వారా మీడియాతో మాట్లాడారు. ‘భారత్‌లో ఇటీవల కోవాగ్జిన్ టీకా తీసుకున్న వారికి సంబంధించిన సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కరోనా కట్టడికి ఏకైక మార్గం కోవాగ్జిన్ అని స్పష్టం చేశారు
Must Read ;- మరో టీకా వస్తోంది..










