(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
నో డిజిటల్ పేమెంట్ .. ఓన్లీ క్యాష్ అంటూ.. క్యాష్ పేమెంట్ చేయకుండా అడ్మిట్ చేసుకోలేమని కేర్ ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో ఏటిఎంల చుట్టూ మూడు గంటలు తిరిగారు. చివరికి ఊపిరాడక రోడ్డుపైనే మహిళ మృతి చెందిన అమానవీయ ఘటన శ్రీకాకుళం జిల్లా రాజాంలో చోటు చేసుకుంది.
శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పెంట అగ్రహారంకు చెందిన అంజలి అనే మహిళకు కరోనా సోకింది. దీంతో ఆమెను రాజాంలోని జీఎంఆర్ వరలక్ష్మి కేర్ ఆస్పత్రికి బంధువులు తీసుకువచ్చారు. క్యాష్ పేమెంట్ చేయకుండా అడ్మిట్ చేసుకోలేమని కేర్ ఆసుపత్రి సిబ్బంది స్పష్టం చేశారు. ఫోన్ పే, గూగుల్ పే లాంటి ఆన్‌లైన్ పేమెంట్‌ను కూడా ఆస్పత్రి సిబ్బంది నిరాకరించారు. కేవలం క్యాష్ ఉంటేనే అడ్మిట్ చేసుకుంటామంటూ స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక డబ్బు కోసం బాధితురాలి బంధువులు ఏటీఎంల చుట్టూ మూడు గంటలు తిరిగారు. ఇంతలోనే బాధితురాలు అంజలికి ఊపిరి ఆడక పరిస్థితి విషమించి రోడ్డుపైనే మరణించింది. కేర్ ఆస్పత్రి సిబ్బంది వైఖరి పట్ల మృతురాలి బంధువులు ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు.
Must Read ;- కరోనా కల్లోలం.. కంటైన్మెంట్ జోన్‌గా శ్రీకాకుళం











