శాస్త్రీయత లేదంటూ నెల్లూరు జిల్లాలో ఆయుర్వేద మందును ఆపించడం దుర్మార్గమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు.ఏపీ ప్రభుత్వం మెడికల్ మాఫియాకు లొంగే ఈ విధమైన చర్యలు తీసుకుందని ఆయన ఆరోపించారు.ఆనందయ్య కుటుంబం శాస్త్రీయంగా,వారసత్వంగా ఎన్నోఏళ్లుగా ఆయుర్వేద మందులు ఇస్తోందని తెలిపారు.ఇప్పటికే దాదాపు 60 వేల మంది కోవిడ్‌కు ఈ మందును తీసుకోగా,వారికి ఎలాంటి సమస్యలు లేవన్నారు. ఆనందయ్య కోవిద్ ఆయుర్వేద మందును పునఃప్రారంభించేలా ఏపీ ఫ్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Must Read ;- అందని వ్యాక్సిన్.. ఆయుర్వేద మందుల కోసం జనం క్యూ










