ఏపీలో కరోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో స్థానిక ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఎపీ సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ తో కూడిన ముగ్గురు అధికారుల బృందం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు తేల్చి చెప్పింది. కరోనా వాక్సినేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాల్సి ఉందని, ఇప్పట్లో ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా లేదని సీఎస్ తేల్చి చెప్పారు. అయితే స్థానిక ఎన్నికలు నిర్వహించకపోతే ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోతాయని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వివరించారు. గంటన్నరపాటు విజయవాడ ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో నలుగురు అధికారుల మధ్య జరిగిన భేటీ ముగిసింది.
స్థానిక ఎన్నికలు నిర్వహించలేం
హైకోర్టు ఆదేశాల మేరకు ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఇవాళ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డను కలిశారు. వారి వాదన వారు వినిపించారు. రోజుకు 2 వేల కరోనా కేసులు నమోదవుతున్నాయని నిమ్మగడ్డకు వివరించారు. అయితే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాల్సిన ఆవశ్యకతను నిమ్మగడ్డ, సీఎస్‌కు గుర్తు చేశారు. ఇలా ఎవరి వాదన వారు వినిపించారు. దీంతో వారి భేటీ ముగిసింది. దీంతో మరోసారి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Must Read ;- విజయసాయిరెడ్డి సిగ్నల్స్.. ఏప్రిల్, మే నెలల్లో స్థానిక ఎన్నికలు