స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు మూడు రోజుల్లోగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను కలవాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వం స్థానిక ఎన్నికలను ఎందుకు నిర్వహించాలనుకోవడం లేదో భేటీలో నిమ్మగడ్డతో చర్చించాలని ధర్మాసనం ఆదేశించింది. ఎస్ఈసీ, ప్రభుత్వం మధ్య చర్చలు ఫలించకపోతే అప్పుడు వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది.
స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వం సహకరించడం లేదని ఎస్ఈసీ హైకోర్టులో వేసిన కేసులో ఇవాళ కూడా వాదనలు జరిగాయి. గత వారం ఉన్నతాధికారులు ఎస్ఈసీతో సమావేశమై చర్చించుకోవాలని హైకోర్టు ఆదేశించినా ఏ అధికారి కూడా నిమ్మగడ్డను కలవలేదు. దీనిపై మరల ఈరోజు ఎస్ఈసీ తరపు న్యాయవాది విషయాన్ని కోర్టుకు విన్నవించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వంలో ప్రిన్సిపల్ కార్యదర్శి స్థాయి అధికారులు నేటి నుంచి 3 రోజుల్లో నిమ్మగడ్డతో భేటీ కావాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా? అనేది ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Must Read ;- వైసీపీ సర్కారు దృష్టంతా స్థానిక ఎన్నికలు తప్పించడం పైనే











